గ్లామర్ ప్రపంచంలో కొన్నేళ్లయినా హవా కొనసాగించాలంటే.. ఫిట్నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇందుకోసం స్టార్లు తెగ కష్టపడిపోతుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే.. వారి కష్టం మరీ వర్ణనాతీతంగా ఉంటుంది. ఉన్నంతలోనే సరదాలను వెతికేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సహజంగా హీరోయిన్లు వర్కవుట్స్ చేసేందుకు తమ లవర్స్ ను పార్ట్నర్స్ గా ఎంచుకుంటూ ఉంటారు. తోటి నటులతోనో.. ప్రేమికులుగా ప్రచారం పొందుతున్నవారితోనే కలిసి జిమ్ లో గంటలకొద్దీ సమయం గడుపుతూ ఉంటారు. కానీ టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఈ విషయంలో తనదంటూ ప్రత్యేకత చూపిస్తోంది. తమ్ముడు అమన్ తో కలిసి వర్కవుట్స్ చేస్తోంది రకుల్ ప్రీత్. అంతే కాదు.. ఇద్దరూ కలిసి జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను కూడా నెట్ లో పెట్టేసింది. తమ్ముడి ట్రైనింగ్ లోనే తన ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేస్తోంది ఈ భామ. అయితే.. ఇక్కడ పైకి కనిపించని ఓ సీక్రెట్ ఉంది లెండి.
రకుల్ ప్రీత్ కి ఓ వ్యాపారం ఉంది. హైద్రాబాద్ లోనే ఓ ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన ఫ్రాంచైజీలున్నాయి. వీటిని నిర్వహించేంది ఎవరో కాదు.. ఆమె తమ్ముడే. మరోవైపు అమన్ ను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది రకుల్. అటు తన తమ్ముడికి.. ఇటు తన వ్యాపారానికి రెండు విధాలా ప్రచారం లభించేలా ఇలాంటి పోస్టులు పెడుతోందట రకుల్ ప్రీత్ సింగ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa