ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి గురించి వింటుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది: వర్మ

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 09:11 AM

శ్రీదేవి మృతి దేశంలోనే పెను సంచలనం సృష్టించింది.. గత రెండు రోజులు శ్రీదేవి మృతి కి కారణం గుండెపోటు అనే వాళ్ళు ఇప్పుడు అంత మారిపోయింది.. శ్రీదేవి మరణం వెనుక కొత్త కోణాలు బయటపడుతున్నాయి.. శ్రీదేవి మరణం ఒక మిస్టరీగా మారింది.. ఇందులో ప్రధాన నిందుతుడిగా ఆమె భర్త బోనీ కపూర్ ను పోలీసుల విచారిస్తున్నారు.. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు స్పందించాడు..


శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించి మాట్లాడుకునే వారని… కానీ, ఇప్పుడు ఏవోవే మాట్లాడుకుంటున్నారని అన్నాడు.. ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఇంకేవో ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నాడు. ‘‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది’’ అని వర్మ ట్వీట్ చేశాడు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa