చిరంజీవి కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సిద్ధా అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఉద్యమ బాటలో ఉరకలేసే ఈ పాత్ర, ఆశయసాధన కోసం ప్రాణాలను అర్పిస్తుందట. ఈ ఎమోషనల్ సీన్ ను తెరపై చూపించాలని కొరటాల అనుకుంటే, అందుకు చిరంజీవి నిరాకరించారనే ఒక టాక్ వినిపిస్తోంది. 'సిద్ధా' పాత్ర చనిపోవడాన్ని తెరపై చూపించడం వలన, ఆడియన్స్ వేరే మూడ్ లోకి వెళ్లిపోతారనీ, అందువలన ఆ పాత్ర ముగింపు సున్నితంగానే ఉండాలనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa