తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణి్క, కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న.భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ , 10 రోజుల కశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ తో 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.జూన్ నెల చివరి వారం నుండి చిత్రీకరణను ప్రారంభిస్తున్నట్టు నిర్మాత నీలిమ గుణ తెలిపారు. ఈసారి తక్కువమందితోనే షూటింగ్ చేస్తామనీ , తరచూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ చేస్తామనీ అన్నారు. “శాకుంతలం ” మూవీని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడ రిలీజ్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa