తెలుగమ్మాయి అంజలికి తెలుగు సినీరంగంలో ఎట్టకేలకు ఓ అవకాశం లభించింది. చిత్రాంగద చిత్రం తర్వాత తెలుగులో ఆమెకు సినిమాలు లేకుండా పోయాయి. గీతాంజలి చిత్రం కోవలో హారర్ థ్రిల్లర్‌గా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాంగద చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో సినిమాలు సన్నగిల్లడంతో ఆమె తమిళ సినీరంగంపై దృష్టి నిలిపింది. అక్కడ ఏడాదికి సరాసరి నాలుగైదు చిత్రాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకొస్తోంది. ప్రస్తుతం పెరంబు, కాళి, నాడోడిగళ్-2 వంటి తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని తెలిసింది. ఓ వైపు తమిళ సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు అవకాశాలొచ్చినా చేసేందుకు ఆమె సంసిద్ధంగా ఉందట.
ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా తెలుగులో ఆమెకు అవకాశం లభించినట్లు సమాచారం. గతంలో వచ్చిన గీతాంజలి విజయం సాధించిన నేపథ్యంలో దానికి కొనసాగింపు (సీక్వెల్)ను నిర్మించేందుకు ఆ చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లోని టైటిల్ పాత్రకు అంజలిని సంప్రదించగా, ఆమె అంగీకరించినట్లు తెnలిసింది. అయితే దర్శకుడు, మిగతా టీమ్‌కు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైందని, ఏప్రిల్‌లో చిత్రం సెట్స్‌పైకి వస్తుందని అంటున్నారు. దీంతో అంజలి టాలీవుడ్‌ను మళ్లిd ఆకట్టుకుని, మరికొన్ని అవకాశాలను చేజిక్కించుకుంటుందేమో వేచిచూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa