దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి నేరుగా ఓటిటి లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ ఫామిలీ ఎంటర్టైనర్ పలు కారణాల చేత అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దానిపై మాసివ్ అనౌన్స్మెంట్ ఈరోజు రానుండగా ఆ డేట్ పై స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 9 రాత్రి ప్రీమియర్స్ తోనే లేదా 10 అర్ధ రాత్రి 12 గంటల కి రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. దీనిపైనే అధికారిక క్లారిటీ ఈరోజు రానున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa