రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచి అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ముగిసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఈ నెల చివరిలో చిత్ర బృందం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa