క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కొండ పొలం'. మరి ఈ దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ ట్రైలర్ ని చూస్తే క్రిష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కానీ కథానుసారం యాక్షన్ మోతాదు కూడా బాగానే కనిపిస్తుంది. ఫైనల్ గా మాత్రం సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. సో మొత్తం ఫ్యామిలీ అంతా ఈ క్లీన్ ఎంటర్టైనర్ ని చూడొచ్చని అర్ధం అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa