నాగశౌర్య - రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలకు ముస్తాబవుతోంది. 'విజయదశమి' సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకులుగా తమన్ - విశాల్ చంద్రశేఖర్ పనిచేశారు. ఈ సినిమా నుంచి ఈ మధ్య వదిలిన 'దిగు దిగు దిగు నాగ' అనే పాట బాగా పాప్యులర్ అయింది. ఈ నేపథ్యంలో మరో లిరికల్ వీడియో సాంగ్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ ముహూర్తాన్ని ఖరారు చేసింది.
రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఈ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. నదియా .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, దసరాకి ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa