ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఒక్కరు కనీసం రెండు సార్లైనా సినిమా చూస్తారు

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 03:30 PM

రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో నటి అనసూయ మాట్లాడుతూ, ఈ సినిమా నభూతో నభవిష్యత్ అని తెలిపింది. ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంది. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని చెప్పింది. ప్రతి ఒక్కరూ కనీసం రెండు సార్లైనా ఈ సినిమాను చూస్తారనే విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని తెలిపింది. ఈ చిత్రంలో తన పాత్రకు తాను పూర్తి న్యాయం చేశానని చెప్పింది మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా 1700 స్క్రీన్ లపై 'రంగస్థలం' విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్, టీజర్లు, ట్రైలర్లు, గ్రామీణ వాతావరణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa