మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ కె. సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన ఈ చిత్రం ప్రీమియర్ షోలు యూఎస్, లండన్‌లలో ముగిశాయి. సినిమా చూసిన వాళ్లు పాజిటివ్ వ్యాఖ్యలను చేస్తున్నారు. చిత్ర హీరో చెర్రీ చిట్టిబాబు పాత్రలో అదరగొట్టేశాడనీ కితాబిస్తున్నారు. సమంత మంచి నటనకు మంచి మార్కులు వేస్తున్నారు.
ముఖ్యంగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య సాగే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉన్నాయంటూ చెపుతున్నారు. కథ పాతదే అయినప్పటికీ, సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని అంటున్నారు. తొలి సగభాగం బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ సూపరని, ఆపై సినిమాను కొద్దిగా లాగినట్టు కనిపించినా, 'జిగేల్ రాణి' పాత్ర, ఆపై ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయంటూ ఈ చిత్రం చూసిన వారు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
ఇకపోతే, ఈ చిత్రానికి సంగీతం ప్రాణంగా ఉందట. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద సినిమాకు సూపర్ హిట్ ఖాయమని చెపుతున్నారు. అయితే, సినిమా నిడివి చాలా అధికంగా ఉండటం మైనస్ పాయింట్‌గా పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో చిట్టిబాబు అన్నగా ఆది పినిశెట్టి నటించగా, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అనసూయ తదితరులు నటించారు.
Chitti babu character will be remembered ...such an emotional n intriguing character it is...Charan's best acting till date...acting improve avvadam kaadu,idi ra acting ani chupinchadu..simple ga cheppalante ruffadinchadu #Rangasthalam #RangasthalamDay
— MegaFansC/O India (@megafans1985) March 30, 2018
Never ever expected performance by #Ramcharan.
Pakka mass movie with sukumark emotions..
A must watch movie...#RangaSthalam #RangasthalamDay
— ksd_umesh (@UmeshKsd) March 30, 2018
#Rangasthalam @aryasukku @Samanthaprabhu2 @AadhiOfficial @prakashraaj @ItsActorNaresh @anusuyakhasba ఇది సినిమా కాదు జీవితం అనేటట్టు నటించేశారు ...#ramcharan జీవితాంతం గుర్తుఉండి పోతుంది మీ నటన kudos to entire team of rangasthalam @ThisIsDSP bgm and songs
— Aman H (@aman_h786) March 30, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa