ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతుంది. టాప్ స్టార్స్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి వారు ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నానక్‌రామ్‌గూడలో వేసిన భారీ సెట్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి ఒక్కలుక్ కూడా విడుదల కాకపోవడంతో ఈ సినిమాలో ఎవరు ఏఏ గెటప్‌లలో కనిపిస్తారో అని అభిమానులు ఆలోచన చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం అమితాబ్ తన బ్లాగ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసి దాదాపు అదే గెటప్‌లో తాను కనిపించబోతున్నట్టు తెలియజేశాడు. అయితే ప్రస్తుతం సైరా చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి, నయనతారలు పక్కపక్కన కూర్చొని యాగం చేస్తుంటే వారి వెనుక అమితాబ్ కూర్చొని ఉన్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఆ పిక్‌లో కనిపిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుదలైన తొలిఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరు, నయనతార, అమితాబ్ గెటప్స్ అభిమానులకి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఈ చారిత్రాత్మక చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువుగా బిగ్ బీ కనిపించనున్నట్టు తెలుస్తుంది బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది చిత్రానికి సంగీతం అందించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa