ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెర్రీ తప్ప ఎవరూ చేయలేరు : ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 12:01 PM

రంగస్థలం మూవీలో చిట్టిబాబుగా రామ్ చరణ్ ప్రదర్శించిన నటనా కౌశలానికి విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రతీ ఒక్కరూ చెర్రీ యాక్టింగ్ ను తెగ పొగిడేస్తున్నారు. సినిమాలో అందరూ తమతమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసినా.. ప్రధానంగా రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ ను ప్రశంసిస్తున్న వారి జాబితాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. 'ఇప్పుడే రంగస్థలం చూశాను. నీకు హ్యాట్సాఫ్ చెబుతున్నా చరణ్. ఇప్పుడు నీకు దక్కుతున్న అన్ని ప్రశంసలు.. పొగడ్తలకు పూర్తిగా అర్హుడివి. ఈ పాత్రను ఇంతకంటే గొప్పగా ఎవరూ పోషించలేరు. ఆ పాత్రకు గౌరవం తెచ్చావ్' అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు చెర్రీ. ఈ తరం నటులలో అగ్రగామిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్.. స్వయంగా తనే చరణ్ పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ అవుతోంది. 


ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరి నుంచి ఇలాంటి ప్రశంసలు వస్తుండడంతోనే.. ఇప్పుడు రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోవడం ఖాయం అయింది. అలాగే తనకు నాన్నకు ప్రేమతో వంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు సుకుమార్ ను కూడా.. రంగస్థలం విజయం సందర్భంగా అభినందించాడు యంగ్ టైగర్. పీరియడ్ డ్రామాను రూపొందించడంలో ఆయన విజన్ ను ప్రశంసించాడు. హీరోయిన్ సమంత.. కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ లకు కూడా అభినందనలు తెలిపాడు ఎన్టీఆర్. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa