ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను క్షమించండి :నటి సమంత

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 05:43 PM

ఈ నెల 30న విడుదలైన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ తో దూసుకు పోతుంది . సూపర్ హిట్ టాక్ టాక్ సంపాదించుకున్న ‘రంగస్థలం’ థ్యాంక్యూ మీట్ ఈరోజు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తాను రాలేకపోతున్నానని నటి సమంత పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. అద్భుతమైన ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేసినందుకు తాను చాలా గర్వపడుతున్నానని చెప్పింది. 

ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలని, వారు చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నానని తెలిపింది. చిత్ర యూనిట్ ఈరోజు నిర్వహిస్తున్న థ్యాంక్యూ మీట్ కు హాజరుకాలేకపోతున్నందుకు క్షమించాలని, ఎంతో సంతోషంగా ఉన్న మిమ్మల్ని కలవలేకపోతున్నానని, ఈ సినిమాలో నటించే అవకాశం తనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. కాగా, విహారయాత్ర నిమిత్తం నాగచైతన్య-సమంతా జంట ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa