రంగస్థలం 100 కోట్ల గ్రాస్ సాధించిన సందర్భంగా టీం అంతా కలిసి ఈ రోజు సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా బదులిచ్చిన యూనిట్ మెంబెర్స్ మొత్తానికి ఊహించిన దాని కన్నా సినిమా ఘన విజయం సాధించడంతో ఆ ఆనందం మొహాల్లో స్పష్టంగా కనిపించింది. విడుదలకు ముందు నుంచే మూడు గంటల లెంగ్త్ గురించి వచ్చిన ఫిర్యాదు గురించి సుకుమార్ నేరుగానే స్పందించాడు. ఎమోషన్ ని క్యారీ చేయటం కోసం అంత వ్యవధి ఉండటంలో తప్పు లేదని ఆ నిర్ణయం తీసుకున్నానని ప్రేక్షకులకు సినిమా నచ్చి ఎక్కువ లెంగ్త్ అనే లోపాన్ని క్షమిస్తారనే నమ్మకంతోనే అలాగే ఉంచేసానని స్పష్టం చేసాడు. ఇవాళ వాళ్ళ స్పందన చూస్తుంటే నా నమ్మకం నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేసాడు సుకుమార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa