ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అయాన్ తో కేక్ కట్ చేయించిన బన్నీ దంపతులు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 04:06 PM

అల్లు అర్జున్ దంపతులు .. తమ తనయుడు అయాన్ కి సంబంధించిన సరదా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ, అభిమానులను మురిపిస్తూ ఉంటారు. అయాన్ ఫస్టు బర్త్ డే నుంచి ప్రతిసారి ఆ వేడుకకి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ వచ్చారు. అలా ఈ రోజు కూడా అయాన్ బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ దంపతులు .. తమ తనయుడు అయాన్ కి సంబంధించిన సరదా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ, అభిమానులను మురిపిస్తూ ఉంటారు. అయాన్ ఫస్టు బర్త్ డే నుంచి ప్రతిసారి ఆ వేడుకకి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ వచ్చారు. అలా ఈ రోజు కూడా అయాన్ బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అయాన్ 2014 .. ఏప్రిల్ 3వ తేదీన జన్మించిన సంగతి తెలిసిందే. గతంలో అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలను ఈ దంపతులు దుబాయ్ .. గోవాల్లో జరిపారు. ఈ సారి 'నా పేరు సూర్య' సినిమా పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉండటం వలన, కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. అల్లు అర్జున్ దంపతులు మొదటి నుంచి కూడా అయాన్ ను అభిమానులకి చేరువలోనే ఉంచుతూ వచ్చారు. అందువలన అయాన్ ను వాళ్లంతా ఎంతగానో అభిమానిస్తూ వుంటారు. వాళ్లంతా కూడా అయాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa