సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా 'రంగస్థలం'లో రామ్ చరణ్ చేసిన సందడికి వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టుకున్న ఈ సినిమా.. మరిన్ని రికార్డుల వైపుగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని చూసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. ''రంగస్థలం.. నిజంగా సెంటర్ స్టేజ్ బుల్లెట్ ఎఛీవ్‌మెంట్.. రామ్ చరణ్ మైండ్‌బ్లోయింగ్లీ ఫెంటాస్టిక్'' అని ప్రశంసించారు. అలాగే ''హేయ్ సుకుమార్.. నీకు నా 3 వందనాలు (ఎమోజీలు). అలాగే మై త్రి (నిర్మాతలు, సంస్థను ఉద్దేశించి) మీకు నా ముద్దులు (ఎమోజీలు)'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను బట్టి ఆర్జీవీకి ఈ సినిమా బాగా నచ్చేసిందని అర్థం చేసుకోవచ్చు.
#Rangasthalam is truly a centre stage bullet achievement..Ramcharan is mindblowingly fantastic ..and hey @aryasukku Here’s my 3 to you and also my 3 to u
— Ram Gopal Varma (@RGVzoomin) April 3, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa