'రాజా రాణి', 'తెరి'( తెలుగులో పోలీసోడు), 'మెర్సల్'(తెలుగులో అదిరింది) సినిమాలతో అటు తమిళ్‌లో పాటు ఇటు తెలుగులోనూ అందరినీ ఆకట్టుకున్న యంగ్ డైరక్టర్ అట్లీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేశాడు. త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతున్నానని అట్లీ స్వయంగా ప్రకటించడం విశేషం. తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు అట్లీ. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. మరి అట్లీ దర్శకత్వంలో నటించబోయే ఆ టాప్ హీరో ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa