ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వివో ఐపీఎల్ తెలుగులో

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 04:45 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్... ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ ఆరంభం అవ్వడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఎన్ టీఆర్ టీవీలో ఎప్పుడు కనిపిస్తాడా... అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించిన ఈ యాడ్ను అఫిషియల్ గా ట్విట్టర్లో విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్.


‘వివో ఐపీఎల్ తెలుగులో వస్తోంది రా...’ అంటూ ఆర్ జే హేమంత్ యాడ్ ప్రారంభంలో కనిపిస్తాడు. దానికి ‘టీవీలో వస్తే చాలు కదరా... తెలుగులో ఏంటీ స్పెషల్’ అంటాడు అతని ఫ్రెండు. అంతే... ‘‘తెలుగులో అయితే ఏంటా?  కారం లేని కోడి... ఉల్లిపాయ లేని పకోడి... పెట్రోల్ లేని గాఢీ... పరుగెత్తడం రాని కేడీ... అవకాయ లేని జాఢీ...ఆటల్లేని బడి... అమ్మప్రేమ లేని ఒడి...’’ అంటూ గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పేశాడు తారక్. వెంటనే ఒప్పుకున్నామంటూ నమస్కరిస్తాడు అతను. ‘అసలు మజా... తెలుగులోనే!’ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు తారక్. వెయిట్ తగ్గిన తర్వాత ఫ్రెష్ లుక్ తో బృందావనం సినిమాలో కనిపించిన విధంగా కనిపించాడు ఎన్ టీఆర్.


తారక్కి ఈ వీవో ఐపీఎల్ సీజన్ ను తెలుగులో చూడడం ఆనందంగా ఉంది... అంటూ ట్వీట్ చేసింది స్టార్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ సీజన్స్ ప్రసారాలను తెలుగులో చేస్తున్న మా మూవీస్లోనే ఐపీఎల్ తెలుగు ప్రసారాలు వస్తాయి. హాట్ స్టార్ లోనూ చూసే అవకాశం ఉంది. జైలవకుశ సినిమా... బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఇన్నాళ్లకు తెర మీద కనిపిస్తుండడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు తారక్ అభిమానులు. త్రివిక్రమ్ శ్రీనివాస్... ఎన్ టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 10న గానీ 12న గానీ విడుదల చేస్తామని కల్యాణ్ రామ్ ప్రకటించాడు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa