వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తోంది.బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ నేడు రిలీజ్ చేశారు. 'దేకో హిం గని.. కనివిని ఎరుగని' అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ సంగీతాన్ని అందించాడు.ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa