ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపైనే బట్టలిప్పేసిన నటి

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 07, 2018, 12:30 PM

ఇటీవల టాలీవుడ్ లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తనని చాలా మంది సినీప్రముఖులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించిన సంగతి తెలియందే. అప్పటికి దిగిరాకుంటే నగ్నంగా ఫిలిం నగర్ లో నిలబడి నిరసన తెలుపుతానని హెచ్చరించింది. అన్నట్లుగానే నేడు శ్రీ రెడ్డి ఫిలిం నగర్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలియజేసింది. శనివారం ఉదయమే శనివారం ఉదయమే శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ముందు తన ఒంటిపై ఉన్న బట్టలను విప్పేసింది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొన్నారు. నాకు అన్యాయం జరుగుతున్నది మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదు. తనకు అన్యాయం చేస్తున్నారు. తన ఆవేదనను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ చర్యకు పూనుకొన్నాను అని శ్రీరెడ్డి మీడియాకు వివరించింది. సినీ ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల ఓ టెలివిజన్ చర్చ కార్యక్రమంలో సినీ పరిశ్రమలోని పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నటిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు లేదు. గుర్తింపు కార్డు ఇవ్వలేదు. సీనియర్ నటులు నాకు అండగా నిలువడం లేదు. తెలుగు అమ్మాయిలు కష్టపడుతుంటే నోరు మూసుకుంటున్నారు. ఓ ఆడదాని ఆవేదన పట్టించుకోవడం లేదు. నాకు జరుగుతున్న అన్యాయం మీడియా ద్వారా బయటపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆడవాళ్ల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సర్కారు ఎందుకు మౌనంగా ఉంటున్నది. ఇలాంటి అన్యాయాలకు ప్రభుత్వం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు న్యాయం చేయకపోతే.. ఒక టెలివిజన్ ఛానెల్‌లో ఏదో భూతులు మాట్లాడారని వారిపై అందరూ నిరసన దిగారు. నటీనటులంతా ఘాటుగా స్పందించారు. అదే నా విషయంలో నాకు న్యాయం జరుగడం లేదు. నాకు కనుక న్యాయం జరుగకపోతే ఫిలింనగర్‌లో బట్టలు లేకుండా నగ్నంగా నిలబడుతా అని శ్రీరెడ్డి హెచ్చరించింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కల్యాణి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నటి కల్యాణి స్పందించింది. ఇలా చవకబారు రీతిలో శ్రీరెడ్డి వ్యవహరిస్తే పరిశ్రమ పెద్దలు, నటీనటులు ముందుకు రారు అని అన్నారు. శ్రీరెడ్డికి అండగా నిలువాలి అని తాను కొందరిని కోరగా.. సినీ పరిశ్రమను బజారుకు ఈడిస్తే ఎవరు మద్దతిస్తారని నన్ను కొందరు నిలదీశారు అని కల్యాణి చెప్పింది. నీవు ఆడదానివేనా? ఓ దశలో నాకు అన్యాయం జరుగకపోతే ఫిలింనగర్‌లో బట్టలూడదీసుకొని నిలబడుతానని వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కల్యాణి మండిపడింది. మీడియాలో ఇలా నోరు పారేసుకొంటున్న నీవు ఆడదానివేనా అని కల్యాణి నిలదీసింది. ఓ దశలో గొంతు పిసికేందుకు పనిచేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెప్పినట్టే అనుకున్న పనిచేసిందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa