ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెహ‌బూబా ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన పూరీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 07, 2018, 12:39 PM

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆకాశ్ పూరీ, నేహా శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం మెహ‌బూబా. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, వేస‌విలో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా పూరీ తెర‌కెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 9 న సాయంత్రం 5గం.ల‌కి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. సందీప్ చౌతా చిత్రానికి సంగీతం అందించాడు. మూవీకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్ ఫ్యాన్స్ లో ఆస‌క్తిని క‌లిగించాయి. ల‌వ్ వార్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa