ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 4న రవితేజ "ఖిలాడీ" సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 29, 2021, 11:01 AM

మాస్‌ మహారాజ్‌ రవితేజ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ” ఖిలాడీ”. రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు.ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరి పోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఖిలాడీ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ వదిలింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో హీరో రవితేజ తాజా స్టైలీస్‌ గా కనిపించాడు. ఓ ఎడారిలో… బ్యాగ్‌ వేసుకుని నడుచుకుంటూ వెలుతున్నారు మాస్‌ మహరాజ్‌. కాగా… ఈ అప్డేట్‌ తో రవితేజ ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa