నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ షో టెలికాస్ట్ ప్రారంభం అవ్వనుంది.ఈ షోలో సినీ ప్రముఖుల్ని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనున్నారు. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షోకి ఫస్ట్ గెస్ట్ మోహన్ బాబు అని సమాచారం. తాజగా న్యాచురల్ స్టార్ నాని ఈ షోకి గెస్ట్ గా వచ్చారు అని టాక్. నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ కథ’ సినిమాలో బాలకృష్ణకి వీరాభిమానిగా కనిపిస్తాడు. ఆ సినిమాలో చేతిమీద జై బాలయ్య అని పచ్చబొట్టు కూడా వేయించినట్టు చూపిస్తారు. మరి ఒక అభిమానిని అభిమాన హీరో ఇంటర్వ్యూ చేస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa