ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఫ్రేములో ముగ్గురు స్టార్ హీరోలు

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 08, 2018, 11:31 AM

రంగ‌స్థ‌లం చిత్ర స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. భ‌ర‌త్ అనే నేను చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు మ‌హేష్‌. త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌న మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌రి వ‌ర్క్స్‌తో వారు బిజీగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికి ఈ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో కనిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ భ‌ర‌త్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిధిగా హాజ‌రు అయ్యారు. ఆ వేడుక‌లో ఒకే స్టేజ్‌పై మ‌హేష్‌, ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు స్టేడియం ద‌ద్ద‌రిల్లేలా గోల చేశారు. కెమెరాలు కూడా ఆ రేర్ స‌న్నివేశాన్ని బంధించేందుకు పోటీ ప‌డ్డాయి. ఇక ఈ ఈవెంట్ త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య ఓ స్టార్ హోట‌ల్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి యూనిట్ స‌భ్యుల‌తో పాటు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా హాజ‌రు అయ్యారు. హోట‌ల్‌లో ముగ్గురు స్టార్ హీరోలు క‌లిసి దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఈ స‌న్నివేశాన్ని చూసి ముగ్గురు హీరోల అభిమానుల తెగ మురిసిపోతున్నారు. ముఖ్య విష‌య‌మేమంటే భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక‌ల‌లో మ‌హేష్ మాట్లాడుతూ.. హీరోలంతా ఒక‌టేన‌ని అంద‌రం స‌ర‌దాగా మాట్లాడుకుంటామ‌ని అన్నారు. కాని అభిమానులు త‌మ‌లో తాము పోట్లాడుకోవ‌డం అస్స‌లు బాగోలేదు ఈ వైఖ‌రి మారాల‌ని స‌ల‌హా ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa