స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో చిరు సైరా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇటీవల నయనతార, చిరు, బిగ్‌బీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించగా, షూటింగ్‌కి సంబంధించిన సన్నివేశాలని బిగ్ బీ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఇవి ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజ గురువు పాత్రలో భారీ గడ్డంతో తెల్లటి విగ్గు పెట్టుకొని కనిపించారు అమితాబ్. ఇక చిరు, నయనతార గెటప్స్ కూడా అభిమానులని అలరించాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలులోని 'కోయిలకుంట్ల' ట్రెజరీని కొల్లగొట్టాడు. ఆ ట్రెజరీ సెట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు. ఒళ్ళుగగుర్పొడిచేలా కీలకమైన ఘట్టాన్ని సురేందర్ రెడ్డి తన దైన స్టైల్‌లో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. జగపతిబాబు , సుదీప్, విజయ్ సేతుపతి సైరా చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నాడని టాక్. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రామ్ చరణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa