కొంత కాలంగా అభిమానులని సస్పెన్స్‌లో పెడుతున్న కోలీవుడ్ జంట ఎవరంటే నయనతార, విఘ్నేష్ శివన్ అని అభిమానులు ఠక్కున చెప్పేస్తారు. టైం దొరికినప్పుడు విదేశాలలో ఎంచక్కా చక్కర్లు కొడుతున్న ఈ జంట చాలా క్లోజ్‌గా ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే నయనతార- విఘ్నేష్ శివన్ జంట కాలిఫోర్నియాలో ప్రత్యక్షం అయ్యారు. పలు లొకేషన్స్‌లో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీరి ఎఫైర్ గురించి మీడియా కోడై కూస్తున్న వీరిద్దరిలో ఏ ఒక్కరు స్పందించడం లేదు. అయితే చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో మాత్రం అవార్డు అందుకున్న నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ అని చెప్పకనే చెప్పింది. ఆఫ్‌స్క్రీన్‌లో రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ జంట ఆన్‌స్క్రీన్‌పైన కూడా రొమాన్స్ చేయనున్నారనేది తాజా సమాచారం. త్వరలో నయనతార ఓ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తుండగా, అందులో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌నే హీరోగా తీసుకోవాలని భావిస్తుందట. కథానాయికగా తనే నటిస్తుందట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. నయన తార హీరోయిన్‌గా విఘ్నేష్ శివన్ ‘నానుమ్ రౌడీదాన్’ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయన్ తెలుగులో సైరా అనే భారీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇందులో చిరంజీవి , అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa