తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అందాల నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మే 9న రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమాని వీలైనంత ఎక్కువగా జనాలలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం విజయ్ ఆంటోని అనే జర్నలిస్ట్ పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ‘‘నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణిగారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మధుర వాణి పాత్రలో సమంత కనిపించనుండగా, మరి ఆ నిజం ఏంటనేది వెండితెరపై చూసి తెలుసుకోవలసిందే. చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనుండగా, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సావిత్రి చివరి రోజులలో అనుభవించిన దుర్భర జీవితాన్ని సినిమాలో చూపించరని తెలుస్తుంది. మిక్కీ జేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa