ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునకు నాని ఏమవుతాడంటే

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 11, 2018, 02:13 PM

కింగ్ అక్కినేని నాగార్జున.. నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ‘భలే మంచి రోజు’.. ‘శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఒక ఆసక్తికర మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున్ డాన్ పాత్ర చేస్తున్నాడని.. నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని కొన్ని రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఐతే ఇందులో వాస్తవమెంతో కానీ.. ఈ చిత్రంలో నాగ్-నానిల మధ్య రిలేషన్ ఏంటన్నది మాత్రం రివీలైపియంది. ఈ విషయాన్ని నానీనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ చిత్రంలో నాగ్-నాని సోదరులుగా నటిస్తున్నారట. అంతటి సీనియర్ హీరో.. ఈ జూనియర్ హీరోకు సోదరుడిగా నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.


ఇదే మాట నాని దగ్గర అంటే.. సినిమాలో తమ ఇద్దరినీ చూసిన వాళ్లకు వయసు తేడా ఏమీ కనిపించదని.. నిజంగానే అన్నదమ్ముల్లా కనిపిస్తారని అంటున్నాడు. వారం రోజుల పాటు నాగార్జునతో ఒక సాంగ్ షూట్లో పాల్గొన్నానని.. ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయానని.. తన వయసు వ్యక్తి లాగే నాగ్ కనిపించాడని నాని అన్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర కథానాయికలుగా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఇంకా ఎవరూ ఖరారవ్వలేదు. ‘శమంతకమణి’కి సంగీతాన్నందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మే ఈ చిత్రానికీ మ్యూజిక్ చేస్తున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉంది చిత్ర బృందం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa