నటీనటులు -నానీ, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ తదితరులు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ ఘట్టమనేని
సంగీతం – హిప్ హోప్ తమిళ
దర్శకత్వం – మేర్లపాక గాంధీ
నిర్మాతలు -సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్ : షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 12 -04-2018
జండాపై కపిరాజు, జంటిల్మెన్ మూవీల తర్వాత నానీ ద్విపాత్రాభినయం చేసిన మూవీ కృష్ణార్జున యుద్ధం.. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకుడు.. వరుస విజయాలతో దూసుకెళుతున్న నానీకి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.. రెండు పాత్రల వేరియేషన్ ఉండటంతో ప్రేక్షకులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు.. ఈ మూవీ ఈ ఈ రోజే రిలీజైంది.. మరి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే..
కథ
ఈ మూవీ చిత్తూరు జిల్లాలో ఉన్న కృష్ణ(నానీ), యూరప్ లో ఉన్న అర్జున్(నానీ)లతో ప్రారంభమవుతుంది.. ఈ ఇద్దరూ అన్నదమ్ములు కాదు, కనీసం ఎటువంటి రక్త సంబంధం ఉండదు.. కాకపోతే ఇద్దరూ ఒకే పోలీకలతో ఉంటారు.. కృష్ణది చిత్తూరు జిల్లా అకుర్తి గ్రామం.. . ఊళ్లో అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు మనసు పారేసుకుంటాడు.. ప్రేమ ప్రేమ అంటూ వెంటపడుతుంటాడు.. అయితే ఈ ఊళ్లో ఏ అమ్మాయి అతడికి పడదు..అయితే ఆ ఊరి సర్పంచ్ మనమరాలు రియా(రుక్సార్ మీర్ ) హైదరాబాద్ లో చదువుకుంటుంది.. సెలవుల్లో అకుర్తి గ్రామం వచ్చినప్పడు కృష్ణ వేషం, భాష చూసి పడిపోతుంది. ఇద్దరూ తెగ ప్రేమించుకుంటారు.. ఇక యూరప్ టాప్ రాక్ స్టార్ గా ఉన్న అర్జున్ ది మరో రకం.. అతడికి ఉన్న పాపులార్టీకి ఎంతో మంది అమ్మాయిలు అతడంటే మనసు పారేసుకుంటారు.. అయితే ఆరణాలు తెలుగమ్మాయిలా కనిపించిన సబ్బలక్ష్మీ(అనుపమ పరమేశ్వరన్) చూసి ప్రేమిస్తాడు.. అమె కూడా అతడి ప్రేమలో పడుతుంది.. ఇదే సమయంలో అక్కడ రియాకు, ఇక్కడ అనుపమలు ఒకే రకమైన చిక్కుల్లో పడతారు.. దీంతో ఆకుర్తిలో ఉన్న కృష్ణ, యూరప్ లో ఉన్న అర్జున్ లు హైదరాబాద్ లో వాలిపోతారు.. ఇంతకీ ఈ ఇద్దరు ప్రియరాళ్లకు ఏమైంది.. మరి ఈ చిక్కుముడిని ఈ కృష్ణార్జునుల విడదీసి వారిని పెళ్లి చేసుకున్నారా అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే..
విశ్లేషణ : ముందుగా చెప్పాల్సి వస్తే ఇది నానీ మార్క్ మూవీ.. తన అభిమానులకు, ప్రేక్షకులకు ఏది కావాలో అలాగే నటించేశాడు ఈ మూవీలో..కృష్ణ పాత్రలో చిత్తూరు యాసతో నవ్వులు పూయిస్తే.. రాక్ స్టార్ అర్జున్ గా సందడి చేశాడు.. కథ ఏమీ లేకపోవడంతో తొలి అర్ధభాగం సరదాగా, రెండో అర్ధభాగం సాగదీతగా సాగింది.. అనుపమ, రుక్సర్ మీర్ లు తమ పాత్రల పరంగా నటించి ఆకట్టుకున్నారు… కార్తీక్ ఘట్టమనేని కెమెరా యూరప్‌తో పాటు, చిత్తూరు జిల్లా పల్లెటూరి అందాలను చాలా అందంగా చూపించాడు.. హిప్‌హాప్ తమిళ సంగీతం పర్వాలేదు.. ఇక దర్శకుడు క్యామెడీ సీన్స్ మాత్రం చాలా చక్కగా తీశాడు.. అలాగే రెండు పాత్రలు ఉన్నప్పటికీ ఎక్కడ కన్ ప్యూజ్ లేకుండా నానీని ప్రజెంట్ చేయడంలో మేర్లపాక గాంధీ సక్సెస్ అయ్యాడు.. రెండో అర్ధభాగం లో మరికాస్త శ్రద్ధ తీసుకుంటే నానీకి మరో బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచేది. అయినే నానీ అభిమానులకు మాత్ర ఈ మూవీ తప్పకుండా అలరిస్తుంది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa