బాలీవుడ్‌లో హీరోయిన్ల నంబరింగ్‌లు తరచుగా మారుతుంటాయి. నంబర్‌వన్ స్థానం ఎవరికీ శాశ్వతం కాదు. తాజాగా బాలీవుడ్‌లో అగ్రస్థాయికి దూసుకువచ్చింది నటి దిషా పటాని. తెలుగులో లోఫర్ చిత్రంలో నటించిన ఈ భామకు ఆ తర్వాత టాలీవుడ్ నుండి ప్రోత్సాహం లభించలేదు. దాంతో హిందీ సినిమాలపైనే దష్టి నిలిపింది. సరైన బ్రేక వస్తే నిలదొక్కుకోవచ్చనే నమ్మకంతో ఉంది. అలాంటి బ్రేక్ బాఘీ 2 సినిమాతో వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయాన్ని పొందడంతో అందరి చూపు దిషావైపు మళ్లింది. అప్పటికే తన అందాలతో, ఫిజికతోే యువతను ఆకట్టుకుని, ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా ఉండే దిషాకు బాఘీ సక్సెస్ మరింత గుర్తింపులు తెచ్చిపెట్టింది. ఈ హిట్‌తో ఆమె డేట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు వెంటపడుతున్నారని సమాచారం. దీంతో దిషా తన పారితోషికం భారీగా పెంచేసిందని అంటున్నారు. దిషా దశ ఈ విధంగా తిరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa