ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగజినె కవర్ పేజీ పై గ్లామరస్ లుక్స్ తో అంజలి

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 13, 2018, 12:30 PM

ఈ మధ్య తెలుగులో అంజలి ఊపు తగ్గింది. రెండేళ్ల కిందట ‘డిక్టేటర్’ సినిమాలో నటించి, ‘సరైనోడు’లో ఐటమ్ సాంగ్ లో మెరిసిన అంజలి, ఆ తర్వాత ‘చిత్రాంగద’ అనే చోటా సినిమాలో చేసింది. అయితే ఈ చిన్న సినిమా ఎవరికీ పట్టలేదు. ఆపై తమిళ అనువాద సినిమాలతో ఈమె పలకరించినా, అవేవీ అంతగా ఆడలేదు. అయితే ఈ తెలుగమ్మాయి కెరీర్ అంతటితోనే అయిపోలేదు.


ఇప్పుడు తన సెకెండ్ ఇన్నింగ్స్‌కు సన్నద్ధం అవుతోంది అంజలి. ఇది వరకూ ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’కి సీక్వెల్ వస్తుందని అంటున్నారు. అలాగే ‘గుంటూరు టాకీస్’ కు సీక్వెల్ పార్టులో కూడా అంజలి నటించే అవకాశాలున్నాయట. వీటన్నింటికీ మించి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అంజలికి ఒక ముఖ్య పాత్ర లభించనున్నదని సమాచారం. అదే జరిగితే.. .సూపర్ స్టార్ సరసన నటిస్తే అంజలి కెరీర్ మళ్లీ ఊపు మీదకు వచ్చినట్టే.


ఈ గ్యాప్‌లో అంజలి ప్రేక్షకులను తన ఫొటోలతో పలకరిస్తోంది. తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నిర్వహించిన ఫొటో షూట్ లో అంజలి తన గ్లామరస్ లుక్స్ లో అదగొట్టేసింది. తన వాడీవేడి ఏమీ తగ్గలేదనే సంకేతాలను ఇచ్చింది. హట్ లుక్స్‌లో అదరగొట్టేసింది. సీనియర్ హీరోల సరసన నటించడానికి తగిన నటిగా గుర్తింపు పొందిన అంజలికి ఈ ఫొటోలతో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.అంజలి తన   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa