పవన్ హీరోగా 'భీమ్లా నాయక్' అనే మూవీ షూటింగ్ జరుగుతుంది, ఈ వినిమాలో రానా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోయిన్గా నిత్యామీనన్ పవన్ సరసన నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ పరిచయం కాబోతుంది. రేపు బీమ్లానాయక్ మూవీ నుండి ఫోర్త్ సింగిల్ విడుదల అవుతుందని మూవీ టీం ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ మూవీకి రీమేక్. ఈ సినిమా నుంచి ఇంతవరకూ మూడు సింగిల్స్ వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గొవ సింగిల్ ను ఈ నెల 1వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల మరణం కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆ ఫోర్త్ సింగిల్ ను రేపు ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'అడవితల్లి మాట' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి సంక్రాంతికి ఒక రేంజ్ లో పోటీ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa