అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలయింది వరుడు కావలెను చిత్రం. కాగా ఈ చిత్రం జనవరి 7నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ని కట్ చేసి జీ5విడుదల చేసింది. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పాత్రను నాగశౌర్య, భూమి పాత్రను రీతూ వర్మ పోషించారు. రీతూ వర్మకు తల్లిగా సీనియర్ నటి నదియా నటించింది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa