ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత ఐటెం సాంగ్‌కి 100 మిలియన్ వ్యూస్..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 11:32 AM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా మామా.. ఊ అంటావా’ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ పాటలో సమంత హాట్ హాట్ స్టెప్పులు అభిమానులను పిచ్చెక్కించాయి. అయితే తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. డిసెంబర్ 10న విడుదలైన ఈ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. కేవలం 20 రోజుల్లోనే ఈ రికార్డును నమోదు చేసింది. దీంతో సామ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ పాటను సింగర్ ఇంద్రావతి ఆలపించగా కు చంద్రబోస్ సాహిత్యం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa