నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తలపతీ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "బీస్ట్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రం రిలీజ్ మంత్ ను ప్రకటించడం జరిగింది. ఈ పోస్టర్ లో విజయ్ గెటప్ ప్రేక్షకులని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ను వచ్చే ఏప్రిల్ 2022 లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa