ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు'ఆచార్య'లో ఐటమ్ సాంగ్ పై రెజీనా స్పందన

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 09:16 PM

మెగాస్టార్ చిరంజీవి  ఆచార్య వచ్చే నెల 4న  విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ‘ఆచార్య’ సినిమాలోని ‘లహే లహే, నీలాంబరి’ పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ‘ఆచార్య, సిద్ధ’ టీజర్లు కూడా విడుదలయ్యాయి. ఇదంతా సినీ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. తాజాగా 'ఆచార్య' సినిమాలోని 'శానా కష్టం వచ్చేసిందే మందాకిని' పాట ప్రోమో విడుదలైంది. దానిపై హెరాయిన్ రెజీనా స్పందిస్తూ... ఆహా ఓటీటీలో 'చెఫ్ మంత్ర'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి అడిగిన ప్రశ్నలకు రెజీనా తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది. "మీరు 'ఆచార్య' సినిమాలో ఓ పాట చేస్తున్న సంగతి తెలిసిందే.. అయిపోయిందా? అవుతుందా? అలా అయితే ఆ అనుభవం ఎలా ఉందో చెప్పండి?" అని శ్రీముఖి ప్రశ్నించింది. రెజీనా స్పందిస్తూ.. "అయిపోయింది.. ఆ పాటను నాలుగు రాత్రులు చిత్రీకరించాం. ఇది సెలబ్రేషన్ సాంగ్.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు.  ఈ తరహా సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa