తమిళ్ హీరో కార్తీ 'ఆవారా', 'యుగానికి ఒక్కడు', 'ఖాకీ', 'ఖైదీ' వంటి హిట్‌లతో తెలుగులో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. 2010లో వచ్చిన 'నా పేరు శివ' కార్తీ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది . కెఇ జ్ఞానవేల్ రాజా తన 'స్టూడియో గ్రీన్ బ్యానర్'పై ఈ చిత్రాన్ని నిర్మించారు.2014లో ‘మద్రాస్’తో తమిళంలో మంచి హిట్ అందుకున్నాడు కార్తీ. ఈ యాక్షన్ డ్రామా చాలా విమర్శకుల ప్రశంసలను అందుకుంది మరియు అనేక అవార్డులను కైవసం చేసుకుంది. కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా హీరోయినిగా నటించింది.పా.రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సూపర్ హిట్ చిత్రం తెలుగులో 'నా పేరు శివ 2' పేరుతో డబ్ అవుతోంది.ఈ చిత్రం జనవరి 2022లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు కాగా, మురళి జి సినిమాటోగ్రాఫర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa