అక్కినేని నాగార్జున, నాగ చైతన్య జంటగా నటించిన 'బంగార్రాజు' చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో విడుదల తేదీని ప్రకటించారు. 'బంగార' పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా'కి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'సోగ్గాడే..' సీక్వెల్‌లో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న నేపథ్యంలో 'బంగార్రాజు'పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa