హీరో శింబు ఎఫైర్స్ నడప డంలో మొనగాడు. నయనతారతో ఆయన ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. వీరి వ్యవహారం గురించి కోలీవుడ్ లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. నయన్ తర్వాత ఈ రొమాంటిక్ హీరో హన్సికను ముగ్గులోకి దింపాడు. ఆమెతో కొన్నాళ్లు సీక్రెట్ గా, మరికొన్నాళ్లు ఓపెన్ గా డేటింగ్ చేశాడు. హన్సికతో చెడిన తర్వా త మరో లవ్ ఖాతా తెరవలేదు. బుద్ధిగా ఉంటున్నాడని అందరు అనుకుంటున్నారు.
కానీ గత రెండేళ్లుగా సీక్రెట్ కాపురమే చేస్తు న్నాడట శింబు. గ్లామర్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నాడట. త్వరలోనే ఈ జంట పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఉందట. ఇక 'మానాడు'తో మళీ హిట్ ట్రాక్ లో వచ్చేశాడు శింబు. . టైమ్ లూప్ బేడ్ థ్రిల్లర్ గా వచ్చిన మానాడు బాక్సా ఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపో తోంది. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ కొనేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa