ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ సినిమా పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన చిత్ర బృందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 11, 2022, 12:52 PM

హీరో ధనుష్- దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని అఫీషియల్ గా ప్రకటించారు.   ద్విభాషా  సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి  తమిళంలో"వాతి" అని తెలుగులో "సర్" గా టైటిల్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా జరిగింది. గత వారం నుండి షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో  మలయాళ నటి సంయుక్తా మీనన్‌ని  కథానాయికగా తీసుకున్నారు.  అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సంయుక్తా మీనన్‌ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ప్రస్తుతం  మరో నటి కోసం చూస్తున్నారు అని పుకార్లు వస్తున్నాయి .   అయితే తాజాగా చిత్ర బృందం అధికారిక  ఈ వార్తల్లో నిజం లేదని  మరియు ఇది నిరాధారమైన  పుకార్లు అని వెళ్ళడించింది. సంయుక్తా మీనన్‌ ఈ సినిమాలో నటించబోతుంధీ అనే క్లారిటీ చిత్ర బృందం ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాన్ని కూడా ధనుష్   అధికారికoగ  ప్రకటించారు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa