బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం "అఖండ". గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో జై బాలయ్య పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తెలివైన స్టెప్పులు, పోటాపోటీగా ప్రగ్యా జైశ్వాల్ డ్యాన్స్, తమన్ సంగీతం ఆకట్టుకున్నాయి. అయితే పూర్తి వీడియో సాంగ్ బయటకు రాగానే చిత్రబృందం వారికి ఆ గిఫ్ట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన "జై బాలయ్య" ఫుల్ వీడియో సాంగ్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు గీతామాధురి, సాహితీ చాగంటి, సత్య యామిని, అదితి భావరాజులు ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa