యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటటైనర్ చిత్రం 'డిజె టిల్లు'. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి సిద్ధు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి రెండవ పాట 'పటాస్ పిల్ల' అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ పాటను సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa