సినీ పరిశ్రమను ఈ పరిశ్రమతో సంబంధమున్న వారితోనే ఎక్కువగా నిండివుంది. తాజాగా సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. '11:11' అనే టైటిల్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్ గా ఈ టైమ్ ను సెట్ చేసుకోవడం వెనుక కారణం ఏమిటనేది సినిమా చూస్తేనేగాని తెలియదట. కథకు .. ఈ సమయానికి మధ్య గల సంబంధం ఏమిటనేది సస్పెన్స్ అని అంటున్నారు. వీరేశ్ నిర్మించిన ఈ సినిమాకి కిట్టు నల్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి రేపు మోషన్ పోస్టర్ ను వదలనున్నారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయిస్తున్నట్టుగా అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం 9:30 నిమిషాలకు రానా ఆన్ లైన్లో ఈ మోషన్ పోస్టర్ ను వదలనున్నాడు. కోటి తనయుడి సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో రాజీవ్ జోడీగా వర్ష విశ్వనాథ్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాతో రాజీవ్ సాలూరు హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa