పలు టాలివుడ్ చిత్రాలను హిందీలో రిమేక్ చేశారు. తాజాగా ఆ జాబితాలో అఖండ సినిమా కూడా చేరనున్నది. బాలయ్య తాజా చిత్రం 'అఖండ' ఘన విజయాన్ని సాధించింది. కరోనాతో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు పాత ఊపును తీసుకొచ్చింది. బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఈ చిత్రం... బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓటీటీలో కూడా ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయింది. ఓటీటీలో సైతం 'అఖండ' దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా క్రేజ్ బాలీవుడ్ కు పాకింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు అఖండ క్యారెక్టర్ కు ఈ ఇద్దరు హీరోల్లో ఎవరైనా సరే న్యాయం చేయగలుగుతారని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa