ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న నాగసౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ న్యూ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 06:39 PM

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తు న్నారు. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నారు. నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. కృష్ణా వీంద్ర విహారి అనే ఈ టైటిల్ ఎంతో ట్రెడిషనల్గా, కొత్తగా ఉంది. కృష్ణా, వింద్ర అనేవి హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది. ఈ పోస్టర్లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదావుగా పూర్తయ్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృఎష్ణ సత్య వంటి కమెడియన్స్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నారు. వారి క్యారెక్టర్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa