ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త తరహాలో "రాధే శ్యామ్‌" ప్రొమోషన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 10:40 AM

రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్‌' సినిమా మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ ఆడియన్స్ లో ఎక్కువ హైప్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు.ఇప్పుడు మేకర్స్ మెటావర్స్‌ అనే మరో ఆసక్తికరమైన ప్రమోషన్‌తో ముందుకు వచ్చారు.'వరల్డ్ ఆఫ్ రాధేశ్యామ్'కి యాక్సెస్ లింక్‌ను మేకర్స్ షేర్ చేసారు.'రాధేశ్యామ్' రియల్  ట్రైలర్‌ను వర్చువల్ స్పేస్‌లో అనుభవించవచ్చు.ఈ తరహాలో ప్రమోషన్ చేసిన తొలి తెలుగు సినిమా రాధేశ్యామ్ అని చెప్పాలి.యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణం రాజు,జగపతి బాబు,భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ పెరియాడికల్ రొమాంటిక్ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేయగా,థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa