ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తికర విషయం చెప్పిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 05:01 PM
నటి సమంత సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 2012 లో తాను ఆత్మవిశ్వాసం కోల్పోయి కుంగుబాటుకు లోనయ్యానని తెలిపింది. మళ్ళీ తిరిగి వర్క్ లోకి అడుగు పెట్టాలంటే ఏదో తెలియని బాధ ఉండేదని తెలిపింది. అలాంటి ఆ సమయంలో డైరెక్టర్ నందిని రెడ్డి తనకు అండగా నిలిచిందని సమంత చెప్పింది. ఎంత బిజీగా ఉన్నా తనను కలుస్తూ తనలో ఆత్మవిశ్వాసం నింపిందని పేర్కొంది. నందిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సమంత ఈ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో ఇప్పటివరకు జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు వచ్చాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa