ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్​' మూవీ ఫస్ట్​ రివ్యూ మీకోసం..

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 04:17 PM

'రాధేశ్యామ్​' సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్, పూజాహెగ్డే నటించిన ఈ సినిమా పీరియాడికల్​ లవ్​స్టోరీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు సినిమా గురించి ఫస్ట్ ​రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు.
"ప్రభాస్​ క్లాస్​, స్టైల్ ​ను భారత్​ లో ఎవరూ బీట్​ చేయలేరు. రాధేశ్యామ్ ​లో ఎంతో అందంగా ఉన్నారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో వీఎఫ్​ఎక్స్​ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ప్రభాస్​, పూజాహెగ్డే కెమిస్ట్రీ బాగుంది​. ఇది అద్భుతమైన సినిమా. ఇక క్లైమాక్స్​ ఓ అద్భుతమైన అనుభూతి. ఎవరూ ఊహించనంతగా ఉంది. సినిమాకే హైలెట్​గా నిలుస్తుంది. మాటల్లో చెప్పలేను." అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa