కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో 2 పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’ మార్చి 11న విడుదల కానుంది.
2.సూర్య హీరోగా పాండిరాజ్ తెరకెక్కిస్తున్న ‘ఈటి’ సినిమా మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.
ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే..
- ధనుష్ నటించిన ‘మారన్’ డిస్నీ హాట్‌స్టార్‌లో మార్చి 11న విడుదల కానుంది.
- ఆది పినిశెట్టి నటించిన ‘క్లాప్’ సినిమా మార్చి 11 సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
- రవితేజ నటించిన ‘ఖిలాడీ' డిస్నీ+హాట్‌స్టార్ లో మార్చి 11న సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- ఆహాలో ఖుబూల్ హై (తెలుగు సిరీస్) మార్చి11న రానుంది.
- జీ5 లో మార్చి 11న మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (హిందీ సిరీస్), రైడర్ (తెలుగు, కన్నడ), రౌడీ బాయ్స్(తెలుగు) స్ట్రీమింగ్ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa